Municipality: ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్, రాయలపూర్ గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యదగిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచవానిసింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి.
Read Also: Minister Ponguleti: ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం..
ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి అంకుశపూర్, ఔషాపూర్, మందారం, ఎదులాబాద్, ఘనపూర్, మఱిప్యాల్ గూడ గ్రామాలు విలీనమవ్వనున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునిరాబాద్, గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి. తుంకుంట మున్సిపాలిటీలోకి బొంరాస్ పేట, శామిర్ పేట, బాబాగుడా గ్రామాలు రానున్నాయి. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోకి రానున్నాయి.పటాన్చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి విలీనం కానున్నాయి. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి పంచాయతీల రికార్డులు వెళ్లనున్నాయి. డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.