Telangana: మంగళవారం నాడు తెలంగాణ రాష్టంలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని భాగంగా మార్క్ ను టీఎస్ నుంచి టీజీ కి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందుకుగాను 1988లోని సెక్షన్ 41(6) మోటారు వాహనాల చట్టం కింద ఉన్న అధికారాలను వాడుకొని 1989 జూన్ 12 నాటికి అప్పటి రవాణా శాఖ జారీ చేయబడిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అందులోని నోటిఫికేషన్ లో టేబుల్ సీరియల్ నంబర్ 29A కింద.., తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న టీఎస్ స్థానంలో అదికాస్తా తాజాగా టీజీ మార్క్ కేటాయించినట్లు తెలిపింది.
Read Also: Nagpur Bus Driver: చేతికి బుల్లెట్ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్ లో మార్పు చేయాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రివర్గంలో ఈ విషయం ఫై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞ్యప్తి పంపారు. దీన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఫై రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీఎస్ నుంచి టీజీకి మారనుంది. దింతో ఇక ఫై వాహనాల నెంబర్ ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీ గా మారనుంది. ఈమేరకు వాహనదారులు వారి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ను ఇప్పుడు మల్లి మార్చుకోవాలా..? అని సందేహం ప్రతి ఒక్క వాహనదారుడికి వస్తోంది. ఈ సందర్బంగా రవాణా శాఖకు చెందిన అధికారులు నంబర్ మార్పుపై స్పష్టమైన సమాచారం ఇచ్చారు.
Read Also: Election Commission : ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం.. మార్చి 14న సెలక్షన్ కమిటీ సమావేశం
ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పులు చేసి మార్చుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జీవో వచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా కొన్న వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని వారు తెలిపారు. ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి టీఎస్ గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రం ఎప్పటిలాగానే యధావిధిగా కొనసాగాయని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించవచ్చని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.