Hamas Israel Conflict: నలుగురు బందీల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas Israel Conflict: సెంట్రల్ గాజాలో శనివారం ఇజ్రాయేల్ నలుగురు బందీల విడుదల కోసం చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మరణించగా.. దాదాపు 700 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు భారీగా ఉన్నారని ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది మరణించినట్లు ఇజ్రాయేల్ తెలపగా.. అయితే, ఈ సంఖ్య ప్రస్తుతం 274కు చేరుకుంది. బాధితుల ఆర్తనాధాలతో అల్-అఖ్సా ఆస్పత్రి ఫుల్ అయిందని ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పుకొచ్చింది. ఆదివారం సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్ దగ్గర ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయల్ ప్రత్యేక దళాలు రక్షించాయి.
Read Also: Boat Airdopes : ఒక్కసారి చార్జ్ చేస్తే 100గంటలు వినొచ్చు.. రూ.999కే హై క్వాలిటీ ఇయర్ బడ్స్
Also Read
అయితే, ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకోవడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బందీలను రక్షించే టైంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు.. ఆ ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇక, నుసీరాత్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో బందీలను ఉంచినట్లు సమాచారం వచ్చింది.. రెండు బిల్డింగుల్లోకి మా బలగాలు ఒకేసారి ప్రవేశించడంతో.. వారిపై పెద్ద ఎత్తున దాడులు చేశారు.. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతి చర్యలు తీసుకున్నామని ఇజ్రాయేల్ వెల్లడించింది.
Read Also: Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు
ఇక, గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మాత్ గా దాడి చేసి.. దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకుపోయాయి. దీంతో, నవంబరులో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ టైంలో కొంత మందిని వదిలిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ చెప్పు్కొస్తుంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!