కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు.
బెంగళూరు వయాలికావల్‌లోని తిరుపతి తిమ్మప్ప ఆలయం ( టీటీడీ )లో లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే, బెంగళూరుకు వచ్చే లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అవును తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది . దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా వస్తోంది. అందువల్ల బెంగళూరులోని తిరుపతి దేవస్థానానికి అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా…