ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అందరి హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గార్గి'. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.