Saipallavi: సూర్య సమర్పణలో సాయిపల్లవి చిత్రం ‘గార్గి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిదా చిత్రంతో తెలుగు వారి గుండెల్లో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలు, గ్లామర్ పాత్రలకు నో చెప్పడం, హీరోలతో ఇగో క్లాష్‌లు ఇలా తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోకుండా తన క్యారెక్టర్ తో ఇంకో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్‌గానే కాకుండా విలువలు గల హీరోయిన్ గా అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. ‘విరాటపర్వం’తో వెన్నెలగా అభిమానుల్ని మెప్పించిన సాయిపల్లవి.. ఇప్పుడు ‘గార్గి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గార్గి’. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ నటులు సూర్య – జ్యోతిక సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సూర్య శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దిగిన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు.
న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక గోవింద్ వసంత సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Jo & I are glad to associate with team #Gargi Some characters just stay in our minds! New thoughts and writing must be celebrated!Hope you all like it!@Sai_Pallavi92 #Jyotika @prgautham83 #AishwaryaLekshmi #GovindVasantha @kaaliactor @SakthiFilmFctry @blacky_genie @2D_ENTPVTLTD pic.twitter.com/uWpGDmgpSp
— Suriya Sivakumar (@Suriya_offl) June 24, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!