ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ జిల్లాలో ఇప్పుడు గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి మారుమూల లోతట్టు గ్రామాల వరకు విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. కళాశాలలు, విద్యాసంస్థల వద్ద యదేచ్చగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన పలు చోరీలు, నేరాలకు సంబంధించి గంజాయి వినియోగమే ప్రధాన కారణమన్న అంశం గూఢీ అవుతోంది. తాజాగా బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసులకు తలతిరిగే సమాచారం అందుబాటులోకొచ్చింది.