Konaseema District: కోనసీమలో కలకలంరేపుతోన్న గంజాయి..!
- కోనసీమ జిల్లాలో గంజాయి వినియోగం కలకలం..
- అమలాపురం నుంచి మారుమూల లోతట్టు గ్రామాల వరకు..
- విచ్చలవిడిగా లభ్యమవుతోన్న గంజాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konaseema District: ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ జిల్లాలో ఇప్పుడు గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి మారుమూల లోతట్టు గ్రామాల వరకు విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. కళాశాలలు, విద్యాసంస్థల వద్ద యదేచ్చగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన పలు చోరీలు, నేరాలకు సంబంధించి గంజాయి వినియోగమే ప్రధాన కారణమన్న అంశం గూఢీ అవుతోంది. తాజాగా బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసులకు తలతిరిగే సమాచారం అందుబాటులోకొచ్చింది. ఈ దొంగతనాల అన్నింటి వెనుక గంజాయే కారణమన్న దిశగా దర్యాప్తులో తేలుతోంది.
Read Also: February 1st chage Rules : బడ్జెట్‌లో ఏం జరిగినా.. ఫిబ్రవరి నుంచి ఛేంజ్ అయ్యేవి ఇవే
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
మూడ్నాలుగేళ్ళ క్రితం వరకు కోనసీమంటే పచ్చని పొలాలు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. జిల్లాలా పునర్విభజన నేపథ్యంలో రగిలిన కులచిచ్చు పట్టణంలో దావానంలా వ్యాపించింది. అప్పటి వివాదం నుంచి కోనసీమ ఇంకా తేరుకోలేదు. అప్పటి కక్షలు, కార్పణ్యాలింకాచల్లా రలేదు. అప్పట్లో. కుల ఉద్యమాల కారణంగా పలువురు యువకులు ఊళ్ళను వదిలిపెట్టి పరారు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ లేనిదిలా కోనసీమ యువతపై పోలీసులు కేసులెట్టి వేధించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా ఇప్పుడు కోనసీమ యువతలో కొందరు గంజాయికి అలవాటు పడుతున్న వైనం వెలుగుచూడ్డం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. వాస్తవానికి కోనసీమలో ఊళ్ళన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పరిసర గ్రామాలకు వేగంగా సమాచారం చేరిపోతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం కావడం పలు సందేహాలకు తెరదీస్తోంది.
Read Also: February 1st chage Rules : బడ్జెట్‌లో ఏం జరిగినా.. ఫిబ్రవరి నుంచి ఛేంజ్ అయ్యేవి ఇవే
ఏజెన్సీ నుంచి నేరుగా..
తూర్పు, విశాఖ ఏజెన్సీల నుంచి గంజాయిని కొందరు దళారులు కోనసీమ జిల్లాలోని ముమ్మిడి వరం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి, రావులపాలెం, అల్లవరం, ఆత్రేయపురం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, రావులపాలెం మీదుగా కాకుండా గ్రామాలు, పుంత రోడ్ల మీదుగా ఈ గంజాయి తరలింపు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తరించిన గంజాయి అదుపునకు పోలీసులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి అమల్లోకి తెచ్చారు. అయితే ఇప్పటికే కళాశాలల్లోకి చేరిన విక్రయాల్ని వీలైనంత త్వరగా అదుపు చేయాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఈ మేరకు పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా మెగా ఏర్పాటు చేశారు ఎక్కడైనా గంజాయి సేవిస్తే పట్టుకోడానికి చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆరుగురు యువకులను పట్టుకుని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?