Punjab: వరస ఎన్‌కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.