యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై భారత్‌పై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ బెదిరించింది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హత్య చేసినందుకు భారతపై దాడులు చేస్తామని అల్-ఖైదా (AQIS) హెచ్చరించింది.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరిని చంపేందుకు హంతకులు ఒకరోజు ముందే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ప్రయాగ్‌రాజ్ కోర్టుకు ఇద్దరినీ తీసుకెళ్లిన రోజునే షూటర్లు అతిఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు ప్రయత్నించ�
సంచలన సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని మరొక జైలుకు తరలించారు. నిందితులు సన్నీ సింగ్, అరుణ్ మౌర్య, లవలేష్ తోవారీ ముగ్గురిని మునుపటి నైనీ జైలు నుండి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు దాడిని పెంచాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసు ఎస్కార్ట్‌లో హత్య చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్ ఈ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు సహా ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు కాల్చి చంపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఝాన్సీలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఓ అధికారి తనను రెండు వారాల్లో చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. 2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఏడుగురిలో అష్రఫ్ అహ్మద్ ఒకరు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్యకేసులో గుజరాత్‌లో సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. యూపీలోని ఆయన నివాసంలో ఉన్న పెంపుడు కుక్క ఆకలిదప్పులతో ప్రాణాలు కోల్పోయింది.