Ashraf Ahmed: రెండు వారాల్లో చంపేస్తారు.. ఓ అధికారి బెదిరించాడని అష్రఫ్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashraf Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఓ అధికారి తనను రెండు వారాల్లో చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. 2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఏడుగురిలో అష్రఫ్ అహ్మద్ ఒకరు. మంగళవారం అష్రాఫ్‌ను బరేలీ జైలుకు తరలించగా, అతిక్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. తనను బరేలీ జైలుకు తరలిస్తుండగా, రెండు వారాల్లో జైలు నుంచి బయటకు తీసుకొచ్చి చంపేస్తానని ఓ సీనియర్ బెదిరించాడని అష్రఫ్ ఆరోపణలు చేశాడు. “రెండు వారాల్లో నన్ను జైలు నుండి బయటకు తీసుకువెళతానని, చంపేస్తానని ఒక అధికారి నన్ను బెదిరించాడు” అని అష్రఫ్ చెప్పాడు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఫేక్ కేసులు కూడా పెట్టారంటే తన బాధను అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, ముఖ్యమంత్రిపై కూడా ఫేక్ కేసులు పెట్టడంతో తన బాధను సీఎం అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే ఆ అధికారి ఎవరని ప్రశ్నించగా.. తాను పేరు చెప్పలేనన్నాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్‌లో ఆ పేరు ముఖ్యమంత్రికి చేరుతుందని వ్యాఖ్యలు చేశాడు. బెదిరింపు గురించి అష్రాఫ్ మాట్లాడుతూ.. తనకు బెదిరింపు ఒక సీనియర్ అధికారి ఇచ్చారని, అతని పేరును ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తికి కూడా వెల్లడిస్తానని చెప్పాడు.
Also Read
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
Read Also: Wayanad Bypoll: వయనాడ్ ఉపఎన్నికపై స్పందించిన సీఈసీ.. అప్పుడే ఎన్నికలు!
2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైలులో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే, రాజు పాల్ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. ఉమేశ్ పాల్ కేసు వేసిన వారిలో అష్రాఫ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో అతడు నిర్దోషిగా తేలాడు. అతీక్ అహ్మద్‌ను యూపీ ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టు 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త అతిక్ అహ్మద్, మరో ఇద్దరిని మంగళవారం దోషులుగా నిర్ధారించింది. వారికి జీవిత ఖైదు విధించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?