ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కల నిజమైంది. ‘మై విలేజ్ షో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వకు సొంత ఇల్లు కావాలన్నది చిరకాల కోరిక. ‘బిగ్ బాస్-4’లో కన్పించిన గంగవ్వ నాగార్జున ముందు తన కోరికను వ్యక్తం చేసింది. ఆ షో చేస్తున్న సమయంలో నాగార్జున గంగవ్వ కోరిక విని, ఆమె ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాగార్జున గంగవ్వకు ఆర్థిక సాయం అందించగా గంగవ్వ…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రారంభించారు. ‘గాడ్ ఫాదర్’ను ఎన్‌వి ప్రసాద్, రామ్ చరణ్‌లతో కలిసి ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ‘గాడ్ ఫాదర్’లోని పాత్రల కోసం మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయడంలో బిజీగా ఉంది. అయితే…
విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో శ్రీవిష్ణు సిద్ధహస్తుడు. అతని తాజా చిత్రం రాజ రాజ చోర సైతం అదే జాబితాలో చేరుతుందని దాని పోస్టర్ డిజైన్స్ ను, పబ్లిసిటీ తీరును గమనిస్తే అర్థమౌతుంది. చోర గాథను త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తామని మొన్న శ్రీవిష్ణు, గంగవ్వతో చెప్పించిన చిత్ర బృందం అనుకున్నట్టుగానే శుక్రవారం ఈ మూవీ కంటెంట్ ఏమిటో చెప్పకనే చెప్పింది. రాజు కిరీటాన్ని దొంగలించిన దొంగ, కొంత కాలం రాజసింహాసంపై కూర్చుని, ఆ తర్వాత అసలు…
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొంతకాలంగా లేనే లేవు. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈ మూవీ గురించి ప్రచార ఆర్భాటాలకు పోని దర్శక నిర్మాతలు ఇప్పుడు నిదానంగా వాటిని షురూ…