‘రాజరాజ చోర’ అప్ డేట్స్ ఎప్పుడంటే!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొంతకాలంగా లేనే లేవు. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈ మూవీ గురించి ప్రచార ఆర్భాటాలకు పోని దర్శక నిర్మాతలు ఇప్పుడు నిదానంగా వాటిని షురూ చేశారు. ఈ సినిమా హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు, మూవీలో అతని దోస్తుగా నటించిన బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతోనే ఆ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. రాజ రాజ చోర మూవీ అప్ డేట్స్ ఏవీ? అని భాస్కర్ పాత్ర పోషించిన శ్రీవిష్ణు అడుగుతుంటే… నువ్వు లేకపోయినా వాటిని సిద్ధం చేశానంటూ ఇందులో అంజమ్మగా నటించిన గంగవ్వ సమాధానం ఇస్తుంది. కాస్త మంచివి చూసి వదులు అని భాస్కర్ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఫైనల్ గా చెప్పొచ్చేదేమంటే… ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చోర గాథ పేరుతో ఈ నెల 11న జనం ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
నిజానికి నెల రోజుల క్రితమేరాజరాజ చోరమూవీ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ పేండమిక్ సిట్యుయేషన్ లో దానిని విడుదల చేయడం ఇష్టంలేక వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో మూవీ గురించిన అప్ డేట్స్ ను జనాలకు తెలియచేసే పనిని షురూ చేశారు. మరి శ్రీవిష్ణు మార్క్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటున్నరాజ రాజ చోర` థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అనేది వేచి చూడాలి. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ సమకూర్చారు.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!