నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈజీమని కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అడ్డదార్లు తొక్కుతున్నారు. దొంగతనాలు, దోపిడీలే కాదు పసిపిల్లలను అపహరించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.10 మంది పసికందులను రక్షించారు. Also Read:Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్ ముఠా సభ్యులు గుజరాత్,…
హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు.
ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి. కావలి అడిషనల్…
అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…
కేటుగాళ్ళు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. డబ్బుల కోసం, బంగారం కోసం ఏ గడ్డితినడానికైనా వెనుకాడడం లేదు. మహిళలు, అమ్మాయిలు, ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా వారు వదలడం లేదు. గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. మొత్తం ఇరవై మూడు మంది ముఠాలో ఉన్నారని, పదిమంది నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని అర్బన్ ఎస్పీ వెల్లడించారు. కరోనా సమయంలో జిజిహెచ్ లో చేరిన…
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆధార్ కార్డే ఆధారం. దీంతో ఆధార్ కార్డు కోసం జనం నానా ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులిస్తూ మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఫేక్ ఆధార్ కార్డ్ ముఠా అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత కొన్నాళ్ల నుంచి నకిలీ…
ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే…