వినాయక చవితి వచ్చేస్తోంది.. ఇప్పటికే వినాయక మండపాలు, ఏర్పాట్లు, వినాయక విగ్రహాల కొనుగోళ్లపై దృష్టిసారించారు భక్తులు.. అయితే, మండపాల ఏర్పాట్లకు పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు.. అయితే, హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పందిళ్లపై పోలీసుల కర్ర పెత్తనం చేయాలనుకుంటోంది.. ఇది తగదు అంటున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు అధికారి ఒక్కో విధంగా వినాయక మండపాల నిర్వాహకులకు ఉత్తర్వులిస్తున్నారు.. ప్రభుత్వం ఉత్సవ కమిటీలతో దాగుడు మూతలు ఆడుతోందని విమర్శించారు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం హిందూ ధర్మంపై గౌరవం లేదని ఆరోపించిన ఆయన.. హిందువుల పండగలపై ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.. గతేడాది వినాయక చవితి ఉత్సవాలను కరోనా పేరుతో నిలువురించారని ఆరోపించారు.. గణేష్ మండపాలకు ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా సింగల్ విండో సిస్టం ద్వారా అనుమతులివ్వాలని కోరారు.. మండపాల అనుమతులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Read Also: Surekha Vani: పెళ్లికి కాదు.. ఆ పనికి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి