Mega Anil : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.
Naga Bandham: పెద్దకాపు 1 సినిమాతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ఇప్పుడు హీరోగా నాగబంధం అనే సినిమా రూపొందుతోంది. గతంలో నిర్మాతగా అనేక సినిమాలు నిర్మించి, డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్స్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు మేకర్స్. Read Also: CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు…
Ganesh Acharya : స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేశ్ ఆచార్య చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్ తో పోల్చి ఏకి పారేశాడు. గణేశ్ ఆచార్య పుష్ప రెండు పార్టుల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డిజైన్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఆ స్టెప్పులు వేయడం ఓ సంచలనం. తాజాగా ఓ బాలీవుడ్ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేశ్ ఆచార్య…
Pushpa-2 : పుష్ప-2 సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది. బన్నీని నేషనల్ హీరోగా మార్చేసింది. దాదాపు అన్ని సినిమాల రికార్డులను కొల్లగొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర సాంగ్ లో బన్నీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఓ స్టార్ హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం…
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటీనటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు రాజీ పడటం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు…
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్చ్ షీట్ దాఖలు అయ్యింది. అతడు, అతని అసిస్టెంట్స్ కలిసి ఒక మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ ఆచార్య వద్ద పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్.. అతను తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే.. 2010లో అతడు తనతో…