Pushpa-2 : పుష్ప-2 సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది. బన్నీని నేషనల్ హీరోగా మార్చేసింది. దాదాపు అన్ని సినిమాల రికార్డులను కొల్లగొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర సాంగ్ లో బన్నీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఓ స్టార్ హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. బన్నీ అలాంటి పాత్రలో కూడా జీవించేశాడని అంతా మెచ్చుకున్నారు. అయితే ఈ సాంగ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ చెప్పారు.
Read Also : Bulliraju : బుల్లిరాజు భారీ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతో తెలుసా..?
పుష్ప-1, పుష్ప-2లోని పాటలకు ఎక్కువగా గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గంగమ్మ జాతర సాంగ్ చేయడానికి మాకు చాలా టైమ్ పట్టింది. దాదాపు 19 రోజులు షూట్ చేశాం. ఆ సాంగ్ మొత్తం బన్నీ చీర కట్టుకుని బ్లౌస్ వేసుకుని ఒంటి నిండా రంగు పూసుకుని ఉండాలి. ఉదయం నుంచి రాత్రి దాకా అలాగే ఉండేవాడు. చూడటానికి మాకే చాలా బాధ అనిపించేది. ఇక ఆ సాంగ్ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి రోజూ బన్నీకి గాయాలు అయ్యేవి. మెడ, నడుము, పాదాలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయినా సరే బన్నీ బ్రేక్ ఇవ్వకుండా ప్రతి రోజూ షూట్ చేశాడు. అతని డెడికేషన్ కు మెచ్చుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు గణేశ్ ఆచార్య.