Naga Bandham: పెద్దకాపు 1 సినిమాతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ఇప్పుడు హీరోగా నాగబంధం అనే సినిమా రూపొందుతోంది. గతంలో నిర్మాతగా అనేక సినిమాలు నిర్మించి, డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్స్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు మేకర్స్.
Read Also: CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు ధర.. సీఎం ఆదేశాలు
కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న ఆరో గదికి సంబంధించిన నాగబంధం కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపద్మనాభ స్వామి దేవాలయ రెప్లికాను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ సిద్ధం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేవలం ఈ సెట్ నిర్మించడానికి సుమారు 6 కోట్ల రూపాయల ఖర్చయింది. అయితే, లోపల అనంత పద్మనాభ స్వామి మూర్తి కానీ, దేవాలయం సెట్ కానీ అచ్చు గుద్దినట్టు ఉండటంతో పాటు, సెట్‌లోకి ఎంటర్ అవ్వడంతోనే ఒక పాజిటివ్ వైబ్‌ను తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: YS Jagan Palnadu Tour: ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య సాగిన వైఎస్ జగన్ పల్నాడు పర్యటన..
ప్రస్తుతానికి ఇదే సెట్‌లో సినిమాకి సంబంధించి ఒక కీలకమైన సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 5000 మంది డాన్సర్లను రంగంలోకి దించిందట సినిమా యూనిట్. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌లో హీరో విరాట్ కర్ణతో పాటు హీరోయిన్ నభ నటేష్, దక్ష నగర్కార్ సహా 5000 మంది డాన్సర్లు, ఇతర జూనియర్ ఆర్టిస్టుల మీద షూట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 10 నిమిషాల పాటు సినిమా అంతా ఈసెట్ లోనే జరగబోతోంది.
మొత్తంగా డాన్స్ అంతా కలిపి పది నిమిషాలకు 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. సెట్ చూసిన వారందరూ అనంత పద్మనాభ స్వామి మూర్తిని చూసి అబ్బురపడుతున్నారు. నిజంగా ఇంత అద్భుతంగా ఎలా చేశారని ఆశ్చర్యపోతున్నారు. రేపు స్క్రీన్ మీద అంతకుమించి అబ్బురపరుస్తామని దర్శకుడు చెబుతున్నాడు. మొత్తం మీద అందరూ ఆ మూర్తిని చూడాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడక తప్పదు.