Mega Anil : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ‘విశ్వంభర’ షూటింగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటి, నాగిని ఫేమ్ మౌనీ రాయ్‌లతో కూడిన ఒక థండరింగ్ మాస్ డాన్స్ నంబర్‌తో ముగించారు. ఈ హై-ఎనర్జీ డాన్స్ నంబర్‌ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. చిత్రంలోని మొత్తం సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సమకూర్చినప్పటికీ, ఈ ప్రత్యేక డాన్స్ నంబర్‌ను భీమ్స్ అద్భుతంగా రూపొందించారు. ఈ ఫుట్-ట్యాపింగ్ సాంగ్‌కు డైనమిక్ రచయిత శ్యాం కాసర్ల సాహిత్యం అందించారు ‘పుష్ప’, ‘పుష్ప 2’, దేవర సినిమాల్లో బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ డాన్స్ నంబర్‌కు కొరియోగ్రఫీ అందించారు. 100 మందికి పైగా డాన్సర్లతో ఈ గీతం డాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయనుంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. కునాల్ కపూర్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని చోటా కె నాయుడు హ్యాండిల్ చేస్తుండగా, విశ్వంభర ప్రపంచాన్ని ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ రూపొందిస్తున్నారు.
https://www.example.com/vishwambhara-shoot-wraps-chiranjeevi-mouni-roy-dance-number