Ganesh Acharya : స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేశ్ ఆచార్య చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్ తో పోల్చి ఏకి పారేశాడు. గణేశ్ ఆచార్య పుష్ప రెండు పార్టుల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డిజైన్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఆ స్టెప్పులు వేయడం ఓ సంచలనం. తాజాగా ఓ బాలీవుడ్ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలో టెక్నీషియన్లకు మంచి ప్రేమ, గౌరవం దొరుకుతుందన్నారు.
Read Also : Betting Apps : పోలీసుల కీలక చర్య.. భయ్యా సన్నీ యాదవ్‌పై లుక్‌ఔట్ నోటీసులు
‘బాలీవుడ్ లో మూవీ హిట్ అయితే కేవలం డైరెక్టర్, హీరోనే పొగుడుతారు. కానీ కొరియోగ్రాఫర్లను పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప పాటలు హిట్ అయితే నన్ను ప్రత్యేకంగా తన ఇంటికి పిలిచి సత్కరించాడు. సార్ మీ వల్లే పాటలు ఇంత పెద్ద హిట్ అయ్యాయి అని చెప్పడంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. నాకు అది చాలు. పుష్ప సిరీస్ అయిపోయాక నన్ను పార్టీకి ఆహ్వానించాడు. ఆ పార్టీలో అందరు టెక్నీషియన్లను పిలిచి అవార్డులతో సత్కరించారు. కానీ బాలీవుడ్ లో అల్లు అర్జున్ లాంటి హీరో ఒక్కరు కూడా లేరు. ఎంత కష్టపడ్డా సరే ఇక్కడ పట్టించుకోరు. లాస్ట్ మినిట్ లో కూడా హీరోలు స్టెప్పులు ఛేంజ్ చేయమంటారు. మా కష్టం అస్సలు పట్టించుకోరు. కానీ సౌత్ ఇండియా హీరోలకు షూట్ కు వెళ్లక ముందే ఒకసారి రిహార్సల్ స్టెప్పులు చూపిస్తే వాళ్లు ఓకే అంటే అదే ఫైనల్ అవుతుంది. మళ్లీ ఛేంజ్ చేయమని చెప్పరు’ అంటూ గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చారు.