బాపూఘాట్లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు.
భారత్‌కు స్వాతంత్ర్యం అందించిన మహనీయుల్లో మహాత్మా గాంధీ ఒకరు. మన దేశంలో ఆయన విగ్రహాలు ఊరూరా కనిపిస్తూనే ఉంటాయి. పక్క దేశాల్లో మహాత్ముడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే అహింసా మార్గాన్ని అనుసరించే యావత్ ప్రపంచానికే గాంధీజీ మార్గదర్శిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మన జాతిపితకు అవ�