భారత్‌కు స్వాతంత్ర్యం అందించిన మహనీయుల్లో మహాత్మా గాంధీ ఒకరు. మన దేశంలో ఆయన విగ్రహాలు ఊరూరా కనిపిస్తూనే ఉంటాయి. పక్క దేశాల్లో మహాత్ముడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే అహింసా మార్గాన్ని అనుసరించే యావత్ ప్రపంచానికే గాంధీజీ మార్గదర్శిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మన జాతిపితకు అవమానం జరిగింది. మెల్‌బోర్న్ నగరంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఈ విషయంపై ఆ దేశంలో దుమారం చెలరేగింది.
Read Also: కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు
మహాత్ముడి విగ్రహ ధ్వంసం ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా అవమానకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ పరువును మంటగలుపుతాయని మండిపడ్డారు. కాగా భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయంతో మెల్‌బోర్న్ శివారులోని రోవిల్లేలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్కాట్ మారిసన్, పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది గంటలకే మహాత్ముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
https://www.facebook.com/subra.ramachandran/posts/10158974200154051