TPCC Meeting: నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు కూడా పాల్గొననున్నారు.
GHMC : జీహెచ్‌ఎంసీ విస్తరణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.!
Also Read
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ఈ మీటింగ్ లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా, పట్టణ అధ్యక్షులకు మహేశ్‌గౌడ్ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే పదవీకాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను పార్టీ సన్మానించనుంది. ఆ తర్వాత త్వరలో జరగబోయే పంచాయతీలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకోవాల్సిన ‘ప్రజాపాలనా విజయోత్సవాల’ నిర్వహణపై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Portronics: ఇన్ బిల్ట్ USB టైప్-C పోర్ట్ తో.. పోర్ట్రోనిక్స్ న్యూ సెల్ బ్యాటరీ విడుదల.. ధర వందల్లో
తాజావార్తలు
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!