మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.
మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బాంరగడ్ తాలుక కత్రన్ గట్ట అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.
Earthquake in Gadchiroli district: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. తెలంగాణలో సరిహద్దులను అనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లా దక్షిణ ప్రాంతం సిరోంచా తాలుకాలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది.
ఛత్తీస్ గడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం కలిగించారు. బాంరగడ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు జేసిబీ,9 ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. దీనివల్ల రూ. కోటి వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దుర్గరాజ్ పీయస్ పరిధిలో 100 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గడ్చిరోలి ప్రాంతంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.