తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని…
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య కేసును లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? లేక భర్తతో విభేదాల? లేదా సీరియల్స్ మూవీస్ కి దూరంగా ఉండటమా?. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏం జరిగింది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. Also Read : Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తాజాగా ఈ కేసు కీలక మలుపు మలుపు తిరిగింది. కన్నడ…
Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి హెచ్ సీయూ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకెళ్ళిన కారు.. అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మానస,డ్రైవర్ అబ్దుల్ రహీం, మరొక జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందారు. సిద్దు అనే మరో…