Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటారు.. పోలీసుల చేతికి చిక్కారు..
- బైకులపై వెళ్తూ ముద్దులు పెట్టుకున్న జంటను పట్టుకున్న పోలీసులు..
- గచ్చిబౌలిలోని అర్షద్ తోపాటు యువతిని అరెస్టు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు. పహాడి షరీఫ్ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద వాహనదారులకు ఈ యువ జంట కనిపించారు. దీంతో వాహనదారులు వీరిద్దరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఈనెల 22న వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు మండిపడ్డారు. వాహనంపై వెళ్తూ బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ వికృత చేష్టలు చేస్తున్నారని.. ఇలాంటి వారిపై పోలీసులు దృష్టి పెట్టి కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా ద్వారా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోను పరిశీలించి బైక్ నెంబర్ ఆధారంగా వారిని గుర్తించారు. గచ్చిబౌలిలోని అర్షద్ తోపాటు యువతిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని పట్టుకొని కేసులను నమోదు చేశారు.
Read also: President Droupadi Murmu: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
- Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా.. నోటీసులు సర్వ్ చేసి పంపించారు. ఇలా నడిరోడ్డుపై వికృత చేష్టలు చేస్తే నోటీసులతో సరిపెట్టమని మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. రోడ్డుపై ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. బైక్ లపై ఇలాంటి వికృత చేష్టలు చేసి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇప్పటికైనా యువత మారి మంచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇలాంటి అసహ్యకరమైన చేష్టలు చేస్తూ బైక్ లపై ప్రయాణించడమే కాకుండా.. ప్రయాణికులకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పోలీసులు చేసిన పనికి స్థానికులు సభాష్ పోలీస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు సెల్యూట్ అంటూ ఇమోజీని పెడుతూ కమెంట్లు చేస్తున్నారు.
Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం
తాజావార్తలు
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!