జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్‌లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.
జీ20 కూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. స్వాగతించారు. నేడు భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించగా.. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు.
దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్‌లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
G20 Dinner Menu: జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు.
G20 Summit: జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు.
G20 Summit: జీ20 సదస్సు తొలిరోజు తొలి సెషన్ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపం గురించి ప్రధాని మొదట మాట్లాడారు. అక్కడ సుమారు 300 మంది మరణించారు.