Railway Stocks: జీ20 సమావేశం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 11 భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పుడు, రైల్వే సంబంధిత స్టాక్‌లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్‌ఎఫ్‌సి స్టాక్‌లతో సహా రైల్వేలకు సంబంధించిన అనేక స్టాక్‌లలో బూమ్ కనిపించింది.
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది.
G20 Summit: భారతదేశంలో జరిగే G-20 సదస్సు గొప్ప కార్యక్రమం తదుపరి ఆర్గనైజింగ్ దేశమైన బ్రెజిల్‌కు పెద్ద సవాల్ లాంటిదే. వచ్చే ఏడాది 2024లో లాటిన్ అమెరికా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల సమూహానికి ఆతిథ్యం ఇవ్వాలి.
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
G20 Meeting: బనారస్‌లో సోమవారం జరుగుతున్న జి20 అభివృద్ధి మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ శతాబ్దాలుగా కాశీ.. విజ్ఞానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉందని అన్నారు.
G20: జమ్మూ కాశ్మీర్ లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్(టీడబ్ల్యూజీ) సమావేశం మే 23,24,25 తేదీల్లో జరగనుంది. శ్రీనగర్ లో ఈ సమావేశం జరుగబోతోంది. అయితే ప్రస్తుతం ఇదే పాకిస్తాన్ కడుపు మంటకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నుతోంది.
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
Poonch Attack: భారతదేశంపై పాకిస్తాన్ తన కుట్రలను అమలు చేయడం ఆపడం లేదు. తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ దినదినం అభివృద్ధి చెందుతుంటే, ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం, అదే అక్కసు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన, అక్కడ శాంతిభద్రతల…
భారత్‌లో జరిగిన జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వేదికగా జీ-20 రహస్య సమావేశం జరిగింది.
Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.