Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం…