G20 Meet: అరుణాచల్‌లో కాన్ఫిడెన్షియల్ G20 మీటింగ్.. సమావేశానికి చైనా దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో జరిగిన జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వేదికగా జీ-20 రహస్య సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పొరుగు దేశమైన చైనా దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. అయితే చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అరుణాచల్ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు చైనా దూరంగా ఉండటం చర్చనీయాశంగా మారింది.
Also Read:AP Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు..
ప్రస్తుతం భారతదేశం G20 అధ్యక్ష వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 50 ప్రధాన నగరాల్లో పలు పలు రంగాలు, అంశాలపై జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి చైనా ప్రతినిధులు హాజరుకాలేదని సమాచారం. ఈ సమావేశంపై చైనా అధికారికంగా భారత్‌కు నిరసన తెలియజేసిందా అనేది స్పష్టత లేదు. అయితే దీనిపై ఇటు భారత విదేశాంగ శాఖ గానీ.. అటు చైనా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ సమావేశాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు.
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
‘పరిశోధన ఆవిష్కరణ చొరవ, సేకరణ’ అనే అంశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభను, ఇటానగర్‌లోని బౌద్ధ విహారాన్ని కూడా సందర్శించారు. అక్కడికి చేరుకున్న వారికి విమానాశ్రయంలో సాంస్కృతిక బృందాలు ఘనస్వాగతం పలికాయి. వారు స్థానిక వంటకాలను కూడా రుచి చూశారని అధికారులు తెలిపారు.
Also Read:CPI Narayana : మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుంది
కాగా, గతంలో తూర్పు లడఖ్‌లో నెలల తరబడి సరిహద్దు ప్రతిష్టంభ కొనసాగింది. గత డిసెంబర్‌లో రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట భారత్, చైనా దళాలు ఘర్షణ పడ్డాయి. LACతో పాటు యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్పుడు ఆరోపించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!