ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే దేశం వదిలిపారిపోయిన గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లిన రాజపక్స తన రాజీనామా లేఖను పాక్స్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ కార్యాలయానికి పంపించారు. తాజాగా ఈ రోజు స్పీకర్ మహిందా యాప అబేదర్థనే అధ్యక్షుడి రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు.
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత శ్రీలంక నిరసనకారుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటికే ఆందోళను చేస్తున్న ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను వదిలి వెళ్తున్నారు. స్పీకర్ రాజీనామాపై అధికారిక ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం ప్రధానిగా, తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘే కూడా తన పదవికి రాజీనామా చేశారు.
Read Also: WhatsApp: త్వరలో మరో క్రేజీ అప్డేట్.. ఫిదా అవ్వాల్సిందే!
మరోవైపు సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అధ్యక్షుడు, ప్రధాని పదవులు ఎవరిని వరిస్తాయో అనేది స్పష్టం కాలేదు. అయితే అధ్యక్ష పదవి కోసం ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనే, జేవీపీ పార్టీ ఎంపీ అనుర కుమార దుస్సనాయకే, మాజీ ఫీల్డ్ మార్షల్, ప్రస్తుత ఎంపీ శరత్ ఫోన్సెకా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ రోజు మరోసారి సమావేశం అవుతున్న అఖిల పక్షం నేతలు అఖిలపక్షం సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో ప్రధాని, అధ్యక్షుడి పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.