మహబూబ్‌నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో తాను కాల్పులు జరపడాన్ని విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టంగా…