దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు…