మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
రత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్‌లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ…