ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సతీమణి శోభతో కలిసి మద్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ పూజలో పాల్గొననున్నారు. ప్రతి ఏటా వినాయకచవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజ్ఞాలు తొలగాలని కేసీఆర్ పూజలు చేయనున్నారు. ఐదు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ కు పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. Also Read:PVN…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ…
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. "సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
కేసీఆర్‌ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారు.. ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలని.. కానీ ఇక్కడ రివర్స్ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం… ప్రతి పక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు. మీరు ఫార్మ్ హౌస్.. ఇంటి నుంచి బయటకు రారు. ఎవరు వచ్చినా.. మీ ఇంటి దగ్గరకే రావాలి. అసెంబ్లీకి మీరు రారు. అసెంబ్లీని మీ ఇంటికి తీసుకు…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ వెళ్లారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.