రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అటవీప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినప్పుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషి ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రిపోర్టులోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర పెరిగిన అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం…
ఆఫ్రికా దేశం కెన్యాలో ప్రస్తుతం కరువు తాండవిస్తోంది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో వన్యప్రాణులకు ఆహరం, నీరు దొరక్క మృత్యువాత పడుతున్నాయి. కెన్యా సఫారీలోని ఓ ప్రాంతంలో ఆరు జిరాఫీలు ఆహారం, నీరు దొరక్క మృత్యువాత పట్టాయి. ఆ దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. డ్రోన్ నుంచి తీసిన ఫొటోలు చూస్తే చేత్తో వేసిన ఆర్ట్స్ మాదిరిగా ఉన్నది. అయితే, అదే ఫొటోలను దగ్గరగా చూస్తే ఒళ్లు జలదరించకమానదు. Read: వేతనాలు,పెన్షన్లపై…