మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది. మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…
పోడు భూముల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులకు, అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యదాద్రి జిల్లాలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూములలో కబ్జాలు లేని 2006 చట్టం ప్రకారం అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక నుంచి అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి…
రాజన్న సిరిసిల్ల జిల్లా… పోడు భూముల పై అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రమేష్ బాబు,రసమయి బాల కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ వుల ను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరి సిల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందన్నారు. దీన్లో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు…
పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్‌రైట్ కమిషన్, పలు మహిళా సంఘాలు సీరియస్…
చిన్నప్పుడు చెప్పిన మాటలు పెద్దయ్యాక ప్రభావితం చేస్తుంటాయి. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా, ఆ మాటల ప్రభావం మనిషిపై తప్పనిసరిగా ఉంటుంది. ఆ వైపే మనిషిని నడిపిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. చిన్నతనం నుంచే భూపాల్‌కు చెందిన సుయాస్ కేసరీ అనే వ్యక్తికి వైల్డ్‌లైఫ్ జంతువులంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. చిన్నతనంలో సుయాస్ అమ్మమ్మతో కలిసి జూకి వెళ్లాడు. ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువులను చూసి కేరింతలు కొట్టారు. నువ్వు ఆనందంగా ఉన్నావు..కానీ, అవి…
ఇంట్లో ఒంటరిగా రెండు మూడు రోజులు ఉండాలంటేనే భయపడిపోతాం. అలాంటిది అడవిలో ఎవరూ తోడు లేకుండా నివశించాలంటే ఇంకేమైనా ఉన్నదా? ఎటు నుంచి ఏ పాము వస్తుందో, కౄరమృగం వచ్చి చంపేస్తుందో అని భయపడిపోతుంటాం. కాని, ఆమె అలా భయపడలేదు. ఒకటి కాదు రెండు కాదు 70సంవత్సరాల నుంచి అడవిలో ఒంటరిగా నివశిస్తోంది. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలంలోని పెదకాద అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉన్నది. ఆ అడవిలో…
దారితప్పి అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు ఆచూకి గల్లంతు అయ్యింది. కలువాయి (మ) ఉయ్యాలపల్లిలో తండ్రి గొర్రెలు,మేకలు మేపేందుకు వెళ్తున్నది చూసి తండ్రి వెనుక వెళ్ళాడు సంజు అనే బాలుడు. అయితే బాలుడు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. డ్రోన్ కెమేరాతో వెతికిన ఫలితం శూన్యంగా ఉంది. ఈ రోజు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపనున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలకు దొరకకపోవడం వల్ల డాగ్స్ స్క్వాడ్ తో వెతుకుతాం అంటున్న పోలీసులు… డాగ్స్ స్క్వాడ్…
విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్…