రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పిల్లి పల్లి అనే గ్రామంలో చిరుత సంచరిస్తునట్టు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలెర్ట్ చేసామన్నారు. రాత్రి సమయంలో ఊరిలో చాటింపు వేసి ఇళ్ల నుండి ప్రజలను బయటికి రావొద్దు అని చెప్తున్నాం.. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వెహికిల్స్ ను ఉంచామన్నారు. చిరుత కనిపిస్తే వెంటనే డయల్100 కి కాల్ చేయాలి…
సంక్రాంతి అనగానే గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పిల్లలకు అయితే ఈ పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేయడమే కాకుండా, గాలిపటాల ఎగురవేతపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఇతరుల గాలిపటాలను ఓడించేందుకు నిషేధిత దారాలను ఉపయోగిస్తుంటారు. అయితే గాలి పటాలను ఎగురవేసేటప్పడు దానికి వాడే దారం, మాంజా వంటివి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్…
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం…
రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు… దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తడపందే రెవెన్యూ అధికారులను చెట్లను లెక్కించడం లేదన్నారు. అనుమతించేందుకు అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. Read Also: తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఢీఎఫ్‌ఓ వరకు…
పులి చర్మం అమ్మేదుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేస్తుంటే రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని గుర్తించి తనిఖీలు చేస్తే పులి చర్మం బయటపడింది. ఇది నిజమైందో కాదో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది నిజమైన పులి చర్మం అని…
చెరువులు, నదుల్లో చేపల వేట కొందరికి సరదా. మరికొందరికి జీవనోపాధి, చేపల కోసం వలవేస్తే కొందరికి తాబేళ్ళు, పాములు, కప్పలు గట్రా పడుతుంటాయి. ఒడిశాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో పడ్డ దాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వలలో ఏకంగా ఒక మొసలి చిక్కడమే అందుకు కారణం. ఇవాళ నా పంట పండిందనుకుని వల పైకి లాగితే సర్రున మొసలి రావడంతో ఆ మత్స్యకారుడు అవాక్కయ్యాడు. వెంటనే అటవీ…
నాగార్జునసాగర్- శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. బోట్ తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని టూరిజం శాఖను అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బోట్ సర్వీసులు నిలివేశారు. కాగా ఈ బోట్ దాదాపు అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ప్రయాణిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ ప్యాకేజీని అధికారులు…