పులి చర్మం అమ్మేందుకు ప్రయత్నం.. ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులి చర్మం అమ్మేదుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేస్తుంటే రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని గుర్తించి తనిఖీలు చేస్తే పులి చర్మం బయటపడింది.
ఇది నిజమైందో కాదో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది నిజమైన పులి చర్మం అని అటవీ అధికారులు నిర్ధారించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుండి పులి చర్మం, 3 సెల్ ఫోన్లు, రెండు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు ములుగు పోలీసులు. పూనం విగ్నిహ తండ్రి సత్య నారాయణ 23 సం. కోయ, డ్రైవర్, కొండాపురం, చీరా క్లీసు తండ్రి వెంకన్న, 32 ఏళ్ళు, తాపీ మేస్త్రీ తో పాటు కె. సోయం రమేష్ తండ్రి పాండు, 37 ఏళ్ళు, చింతల బాలకృష్ణ తండ్రి కోటయ్య, 25 ఏళ్ళు, ఆటో డ్రైవర్. సోది వంటి తండ్రి బాబు, 23ఏళ్ళు కూలీని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితుల్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఏడాది మూడు పులిచర్మాలను పట్టుకున్నారు ములుగు పోలీసులు. ఈ ఏడాది జూలై 3, అక్టోబర్ 3, డిసెంబర్ 21న పులిచర్మాలు పట్టుబడ్డాయి.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!