ఆ రాబందు.. చూడటానికి సాధారణంగానే ఉంది. కానీ.. దాని కాళ్లకు మాత్రం జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరా అమర్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. బాగా అలసిపోయింది ఆ రాబందు.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర వెలకట్టలేనిది. మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్..
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెరువులోకి ప్రవేశించిన 11 అడుగుల ఆడ మొసలిని చూసి ప్రజల్లో భయం నెలకొంది. మొసలిని చూసిన గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది.
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మందలో నుంచి ఓ ఏనుగు తప్పిపోయి మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. అటవీ అధికారులు ఎంతో శ్రమించి ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపించారు.