Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. అడవిలో చిక్కుకున్న నలుగురు చిన్నారులతో సహా గిరిజన కుటుంబాన్ని అటవీశాఖ అధికారులు రక్షించారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. వాస్తవానికి, ఈ వారం ప్రారంభంలో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 344 మందికి పైగా మరణించారు. 206 మంది జాడ ఇంకా తెలియరాలేదు. మరణించిన వారిలో దాదాపు 30మంది పిల్లలు ఉన్నారు.
కలపేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. హషీస్ నాయకత్వంలో నలుగురు బృందం గురువారం (ఆగస్టు 1) ఒక గిరిజన కుటుంబాన్ని రక్షించడానికి అడవిలోని ప్రమాదకరమైన మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా బయలుదేరింది. వాయనాడ్‌లోని పానియా వర్గానికి చెందిన ఈ కుటుంబం కొండపై ఉన్న ఒక గుహలో చిక్కుకుంది. దాని ప్రక్కనే లోతైన లోయ ఉంది. ఆ కుటుంబంలో ఒకటి నుంచి నాలుగేళ్ల మధ్య వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ బృందం గుహకు చేరుకోవడానికి నాలుగున్నర గంటలకు పైగా సమయం పట్టింది.
Read Also:Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
Kerala: In Wayanad, forest department personnel rescued six tribals, including four children, from a landslide-affected area pic.twitter.com/bbYYyQX3eS
— IANS (@ians_india) August 3, 2024
అటవీ అధికారి కె. వాయనాడ్‌లోని పానియా సామాజికవర్గానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ఒక మహిళ, నాలుగేళ్ల చిన్నారిని దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో కనిపించిందని హాషిస్ చెప్పారు. విచారించగా ముగ్గురు పిల్లలు, ఆమె భర్త గుహలో చిక్కుకున్నట్లు తేలింది. ఆ ప్రజలకు తినడానికి, త్రాగడానికి ఏమీ లభించడం లేదు. పానియా కమ్యూనిటీకి చెందిన ఈ కుటుంబం గిరిజన సమాజంలోని ప్రత్యేక విభాగం నుండి వచ్చిందని, వారు సాధారణంగా బయటి వ్యక్తులతో కలవడానికి ఇష్టపడరని హాషిస్ చెప్పారు. వారు సాధారణంగా అడవిలో లభించే ఆహారంపై ఆధారపడతారని ఆయన తెలిపారు. దీంతో పాటు ఆ సరుకులను స్థానిక మార్కెట్‌లో విక్రయించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కానీ వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా వారికి తినడానికి ఏమీ లభించకుండా పోయింది.
కొండపై వారి వద్ద ఉన్న గుహ వద్దకు వెళ్లేందుకు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చిందని, అయితే నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండటంతో రాళ్లపై నాచు కారణంగా జారడం వల్ల ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉందని అటవీ రేంజ్ అధికారి తెలిపారు. ఎలాగోలా మెల్లగా, జాగ్రత్తగా ఎక్కి పిల్లల దగ్గరకు చేరుకున్నాం. ప్రయాణం చాలా ప్రమాదకరంగా సాగింది. కాస్త కాళ్లు జారితే నేరుగా లోయలో పడిపోయే వాళ్లమన్నారు. ఆ పిల్లలను శరీరాలకు కట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యామని తెలిపారు.
Read Also:Tollywood : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ‘అల్లూ’ కార్యక్రమం.. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో..?