Bears Dead: ఛత్తీస్ గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలుడు కారణంగా మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. ఈ పేలుడు మావోయిస్టులు ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)ను అమర్చడం ద్వారా జరగింది. ఫారెస్ట్ అధికారులు ఈ విషయన్నీ ధృవీకరించారు. పేలుడు కారణంగా ఓ ఆడ ఎలుగుబంటి, దాని రెండు పిల్లలు అక్కడే మృతిచెందాయి. మావోయిస్టులు ఈ బాంబులను జవాన్లను లక్ష్యంగా చేసుకుని అమర్చారు. ఎలుగుబంట్ల పాదాలు బాంబును తాకగానే అది పేలిపోయింది.
Also Read: UiTheMovie : ‘యూఐ’ ప్రీమియర్ టాక్.. దటీజ్ ఉపేంద్ర
ఈ ఘటన హంద్వారా – కోషల్నార్ కుర్సింగ్ బహార్ మధ్య కొండ కాలువ వద్ద చోటు చేసుకుంది. చిన్న విషాదం కలిగించే ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఆయన చనిపోయిన ఎలుగుబంట్ల చిత్రాన్ని పోస్ట్ చేసి, ఈ దురదృష్టకర ఘటనను షేర్ చేశారు. ఈ ఘటన అనంతరం, పోలీసుల సహకారంతో అటవీశాఖ బృందం ఎలుగుబంట్ల మృతదేహాలను తీసుకురావడానికి సిద్ధమయ్యింది. కానీ, ప్రమాదకరమైన ప్రదేశంలో ప్రవేశించలేని కారణంగా, సైనికులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మరొక ఘటనలో ఓ గ్రామస్థుడు పేలుడు కారణంగా మృతిచెందిన ఘటన జరిగింది.
Also Read: US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..