Food Poison : ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మందికి పైగా మానసిక రోగులు భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరణ్ అనే వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతిచెందాడు. ఇతర బాధితులను ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్సకు తరలించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆహారం నమూనాలను పరిశోధన కోసం పంపారు. ఫుడ్ పాయిజన్‌కి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..