తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు పొగ మంచుతో వాహనదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోతోంది.
Delhi : దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఈ సలహాలో, దట్టమైన పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా విమానాశ్రయం ప్రయాణికులకు తెలియజేసింది.
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. కాగా.. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్‌లో కురిసే మంచు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరిల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి.
Heavy Fog in Delhi Today: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 10-11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. మరోవైపు నేడు, రేపు రాజధానిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.…
134 Flights, 22 Trains Late Due to Fog in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈరోజు ఉదయం విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు 0 మీటర్లకు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాల (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకల్లో జాప్యం నెలకొంది. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం చూపింది. విజిబిలిటీ…
పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఢిల్లీ సహా ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీలోని లోధి రోడ్‌లో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.