అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి ఎంతోమంది నిరుపేదలు తమ గూడును, నీడను కోల్పోయారు. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన గ్రామాల్లో పర్యటించడానికి అసోం బీజేపీ ఎమ్మెల్యే సిబుమిశ్రా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ చోట కేవలం పాదం మునిగేంత నీరు మాత్రమే ఉంది. కానీ ఆ వరద నీటిలో నడిచేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఇష్టపడలేదు.
నీళ్లలో నడిస్తే బూట్లు పాడవుతాయని ఎమ్మెల్యే సిబుమిశ్రా భావించారు. దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడి భుజంపై ఎక్కి ఎమ్మెల్యే సిబుమిశ్రా బోటు వరకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. అడుగు లోతు నీళ్లు కూడా లేని చోట నడవలేరా? అంత అహంకారమా? అని ఎమ్మెల్యేను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా ఓవరాక్షన్ చేయడంపై వరద బాధితులు, నెటిజన్‌లు మండిపడుతున్నారు.
Assam Flood scenes: Lumding MLA Shibu Mishra getting trolled for taking piggyback ride on back of a person to a rescue boat while visiting flood affected area. After video goes viral Mishra tries to justify his action and says he was unwell so he had to do that. pic.twitter.com/2OdkJ48cgj
— Tulika Devi (@tulika_devi) May 19, 2022