Insurance: వర్షాలకు కారు కొట్టుకుపోతే క్లెయిమ్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది.. పలు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు నగరాలన్ని కూడా జల దిగ్బెందంలో ఉన్నాయి.. ఎటు చూసిన నీళ్ళే కనిపిస్తున్నాయి.. డీల్లీలో 42 ఏళ్లలో ఎప్పుడూ పడని విధంగా భారీ వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు..పొంగిపొర్లుతున్న నదుల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్షపు నీటిలో ప్రజల ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటిలో మునిగిపోయాయి. కారు మునిగిపోయినా లేదా వరదలో కొట్టుకుపోయినా.. దానిని క్లెయిమ్ చేయడానికి మార్గం ఏంటి? అటువంటి పరిస్థితిలో నేను క్లెయిమ్ పొందగలనా లేదా? అనే సందేహాలు చాలానే జనాలకు వస్తుంటాయి.. ఆ విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ కారు వరదల కారణంగా పాడైపోయినా లేదా తప్పిపోయినా, మీరు చేయవలసిన మొదటి విషయం ఏంటంటే, కారు లేదా బైక్‌ను రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును క్లెయిమ్ చేయడానికి మీ బీమా సంస్థను సంప్రదించడం. ప్రతి కారు భీమా ఈ విషయంలో మీకు సహాయం చేయదని ఇక్కడ తెలుసుకోవడం ముఖ్యం. అందువల్ల, కారు బీమా పాలసీని పొందే ముందు దాని ఫీచర్లు, ప్రయోజనాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం..
Also Read
- PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
- B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
- Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
- Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడంలో సమగ్ర కారు బీమా పాలసీ మీకు సహాయపడుతుంది. ప్రమాదవశాత్తు నష్టం, అగ్నిప్రమాదం లేదా పేలుడు, దొంగతనం, థర్డ్ పార్టీ క్లెయిమ్ బాధ్యతలకు వ్యతిరేకంగా ఈ పాలసీ కారు లేదా ఏదైనా రకమైన వాహనాలను కూడా కవర్ చేస్తుంది..ఈ బీమా పాలసీలో కారు ఇంజిన్‌కు కలిగే నష్టాన్ని కవర్ చేయదు. అలాంటప్పుడు, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవాలి. ఈ యాడ్-ఆన్‌తో, మీరు మీ కారు లేదా బైక్ దెబ్బతిన్న ఇంజిన్ భాగాలను రిపేర్ చేయడానికి లేదా భర్తీ చేయడానికి క్లెయిమ్ చేయవచ్చు.. వరదల కారణంగా కారు బాగా దెబ్బతిన్నట్లయితే, దానిని మరమ్మత్తు చేయలేము, అటువంటి పరిస్థితిలో ఇన్వాయిస్ కవర్‌కు తిరిగి రావడం ఉపయోగపడుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఖర్చు, రోడ్డు పన్ను కూడా ఉంటుంది. ఇది మీ పాలసీ నిబంధనలపై కూడా ఆధారపడి ఉంటుంది.. అందుకే ఇన్సూరెన్స్ తీసుకొనే ముందు ఇలాంటివి చదివి అప్లై చేసుకోండి..
తాజావార్తలు
-
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!