పెళ్ళంటే సందడే వేరు. పెళ్ళికి సర్వం సిద్ధం అయింది. కానీ భారీ వర్షం పెళ్ళింట్లో విషాదం నెలకొంది. కడప జిల్లా రాజంపేటలో వర్షం బీభత్సం కలిగించింది. ఈ వరద పెళ్ళి ఇంట్లో విషాదం నింపింది. పెళ్ళి ఆగిపోయింది. రాజంపేట రామచంద్రాపురంలో చెయ్యేరు వరద నీటిలో కొట్టుకుపోయింది 75 ఏళ్ళ సావిత్రమ్మ. దీంతో మనవడి పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోయింది.
రాజంపేటలో ఇవాళ అమరనాథ్ అనే యువకుని పెళ్ళి జరగాల్సి వుంది. వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు సంచిలో పెట్టారు. భారీ వర్షంతో పెళ్ళి ఇంట వరద ప్రవహించింది. బంగారం, నగదు వుంచిన సూట్ కేసులు, పెళ్ళి సామాను.. అన్నీ వరద నీటిలో కొట్టుకు పోయాయి. వాటితో పాటు నాయనమ్మ సావిత్రమ్మ కూడా వరద నీటికి బలయింది. పెళ్ళి వారు వుండే ఇల్లు నేలమట్టం అయింది. డబ్బు, ఖరీదైన నగలు కంటే అవ్వ సావిత్రమ్మ కొట్టుకు పోయి ఆచూకీ లభించక పోవడంతో పెళ్ళివారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంతేకాదు గ్రామంలో తడిసి పారేసిన 1000 మూటల వడ్లు,500 మూటల బియ్యం వరదార్పణం అయ్యాయి.
వీటికి తోడు ప్రవాహంలో కొట్టుకు పోయాయి 1000 ఆవులు,500 దూడలు,3లక్షల విలవ గల కోళ్లు. కూలిన ఇళ్ళు, ఇసుక మేటలతో గ్రామం స్మశానంగా మారింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో అంతా నష్టపోయారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పెళ్ళి మధ్యలోనే ఆగిపోవడంతో పెళ్ళికొడుకు అమర్ నాథ్. పెళ్ళి ఇంట విషాదం నెలకొంది.