Vijayawada Floods: ఎవరి నోట విన్నా వెహికల్ రిపేర్ టాపికే..! ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితుల క్యూ..
- వరదలతో దెబ్బతిన్న వేలాది వాహనాలు..
- వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌పై దృష్టిసారించిన ఐఆర్‌డీఏ..
- వారం రోజుల్లోగా స్టేటస్ రిపోర్ట్ పంపించాలని సూచన..
- లేట్ కాకుండా చూడాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ ఆదేశం..
- బుడమేరు వరదల్లో మునిగిపోయిన 30 వేలకుపైగా కార్లు..
- బురదలో కూరుకుపోయిన లక్షకుపైగా వాహనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పూడ్చలేని నష్టాన్ని మిగిల్చాయి. కొంపాగోడు తుడిచిపెట్టుకుపోయాయి. మూగజీవాలు కళ్లముందే జలసమాధయ్యాయి. ఇక వాహనాల సంగతి సరేసరి. బురదలో కూరుకుపోయి.. వరదకు కొట్టుకుపోయి.. నీళ్లలో నానిపోయి.. బయటపడుతున్న బండ్లను చూస్తుంటే ఉసూరుమంటోంది. వందల కార్లు, వేల బైక్‌లు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. వరద నీరు నెమ్మదిగా వెళ్లిపోవడంతో బురదలోంచి బయటపడ్డాయి. నొక్కులుపోయి.. రంగుపోయి…అద్దాలు పగిలిపోయి..డోర్లు బిగుసుకుపోయి.. ముఖ్యంగా ఇంజిన్లలోకి నీళ్లు వెళ్లి.. పనికొస్తాయా లేదా అన్నమానంతో ఉన్నారు బాధితులు. కొన్ని వాహనాలు కంటికి కనిపించకుండా పోయాయి. వరద ప్రవాహం ఎటు వెళ్లిందో ఆ అంచనాను బట్టి వెళ్లి వెతుక్కుంటున్నారు కొందరు.
విజయవాడలో లక్షకు పైగా బైక్‌లు.. 30వేల పైచిలుకు కార్లు.. 5 వేల పైబడి ఆటోలు, ఇతరాత్ర వాహనాలు నీటమునిగాయి. ఇది కేవలం ఇప్పుటి వరకున్న అంచనా మాత్రమే. ప్రస్తుతం ఇవేవీ పనికొచ్చేలా కనపించడం లేదు. రిపేర్ చేసినా ఏం నడుస్తాయో అన్న అనుమానం ఉంది. చివరి ప్రయత్నంగా వాహనాలను బురదలోంచి లాగి మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహకిల్సే. ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి. ప్రతి షెడ్ దగ్గర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రోజుల సమయం పడుతుందని చెప్పినా బండి నడవడకపోదా అనే ఆశతో రిపేర్ చేయండని చెబుతున్నారు!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
అయితే బైక్‌లకు మోపెడ్‌లకు పెద్దగా ప్రాబ్లమ్స్ రావని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త బండ్లయితే టెన్షన్ పడొద్దని అంటున్నారు. కారు ఇంజిన్‌లోకి నీళ్లుపోతే బండిని స్టార్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ సహా మునిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. వారంటీలో ఉంటే షో రూం వాళ్లే రిపేర్ చేసే అవకాశం ఉంది. చేసుకున్న ఇన్షూరెన్స్‌లో వరదలు, భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారంతా పేద, మధ్యతరగతి ప్రజలే కాబట్టి వారి పట్ల మానవీయ కోణంలో స్పందించాలని అన్నారు. ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దని కోరారు చంద్రబాబు.
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?