AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగాయి హెలికాఫ్టర్లు. ప్రస్తుతం రెండు హెలికాఫ్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నాయి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు.. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు.. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు.. హెలికాఫ్టర్ల ద్వారా బాధితుల ఇళ్లపై ఆహార ప్యాకెట్లను జారవిడుస్తున్నారు సిబ్బంది. మరో రెండు హెలికాఫ్టర్లు కూడా సహాయక చర్యలు, సేవ కార్యక్రమాల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు..
Read Also: Pawan Khera : సెబీ చీఫ్ కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.16.80 కోట్ల జీతం!.. కాంగ్రెస్ ఆరోపణలు
కాగా, భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. మంత్రులు కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.. మరోవైపు.. ఫుడ్ సరఫరా చేసేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దించేందుకు సిద్ధం అవుతుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనన్ని ఎక్కువ డ్రోన్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.