ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్. ఎందుకిలా? వరదల టైమ్‌లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ల తీరు విమర్శలకు…